Posts

బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్

Image
బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్ కావలిసిన  పదార్థాలు  1. బంగాళాదుంపలు  3  2. గ్రీన్ పీస్  అర కప్పు 3. బ్రెడ్ స్లైసెస్  8 4. గరం మసాలాపొడి  అర స్పూన్  5. అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్  6. జీడిపపప్పు  పొడి  1 స్పూన్  7. కారం  1 స్పూన్ 8. ఉప్పు  రుచికి  సరిపడా  9.  కొత్తిమీర  తురుము  1 స్పూన్  10. జీలకర్ర  పొడి  1 స్పూన్ 11.   ధనియాల  పొడి  1 స్పూన్  12.  ఆయిల్  4 స్పూన్స్ 13.   నెయ్యి తయారీ  విధానం ముందుగా  బంగాళదుంపలను , గ్రీన్ పీస్  ను  శుభ్రం  గా  కడిగి , కుక్కరులో  పెట్టి  ఉడికించుకోవాలి . చల్లారిన  బంగాళదుంపలను  , పైన  వున్న తొక్కను  తీసి ఒక పక్కన  పెట్టుకోవాలి . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి  , దోరగా  వేగాక , బంగాళదుంపలను  ,గ్రీన్...

సాష్టాంగ నమస్కారం

Image
సాష్టాంగ నమస్కారం స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి. " ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే " అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం - పాదములు, కరాభ్యాం - చేతులు, కర్నాభ్యాం - చెవులు. బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

Image
దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. 2. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. 3. బంగారం ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి. 4. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది 5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు. 7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు. 8. తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది. 9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది. 10. టెంకాయ  దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. 11. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది. 12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది ఈశ్వరలోక దర్శనం       కలుగుతుంది. 14. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది. 15. పండ్లను దానంచేస్తే బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

" దర్భ " యొక్క ప్రాముఖ్యం

Image
" దర్భ " యొక్క ప్రాముఖ్యం మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో 1. కుశ జాతి దర్భను శుకర్మలకు, 2. బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, 3. శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను     గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి,  భ...

లక్ష్మీ కటాక్షం లభించాలంటే

Image
లక్ష్మీ కటాక్షం లభించాలంటే 1. ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి. 2. సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. 3. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప     హారతులు   ఇవ్వాలి. 4. .ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి. 5. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు. 6. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయ అల్పాహారం తినకూడదు. 7. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. 8. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. 9. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి. 10. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. 11. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 12. ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేముందు లక్...

వంకాయ వేపుడు

Image
వంకాయ వేపుడు కావలిసిన  పదార్థాలు  1. వంకాయలు  పావుకేజీ 2.  పసుపు  కొద్దిగా  3. ఉప్పు  రుచికి  సరిపడా  4. కూర కారం  తగినంత  5. సెనగ పిండి  2 స్పూన్స్  6. ఆయిల్  6 స్పూన్స్ తయారీ  విధానం కూర కారానికి సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ , ఆవాలు అర  స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ , ధనియాలు 1 స్పూన్  ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి . వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి . వంకాయలను  శుభ్రం  గా  కడిగి ఒక మోస్తరు  ముక్కలు గా  తరుగుకోవాలి. స్టవ్  వెలిగించి.  వెడల్పయిన  బాణలి  పెట్టి  ఆయిల్  వేసి వంకాయ ముక్కలు  ,పసుపు   ,వేసి  బాగా  వేగనివ్వాలి  మధ్య  మధ్య లో   అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి . ఆయిల్  కూడా  వేస...

తోటకూర కందిపప్పు

Image
తోట కూర కందిపప్పు కావలిసిన  పదార్థాలు  1. తోటకూర  3 కట్టలు 2.  కంది పప్పు  1 కప్పు  3. పసుపు  కొద్దిగా  4. ఉప్పు రుచికి  సరిపడా  5. పచ్చిమిర్చి  2.  6. వెల్లుల్లి  రెబ్బలు  3  7. నీళ్లు  తగినన్ని పోపు దినుసులు  మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర  అర స్పూన్ , ఇంగువ  కొద్దిగా  , ఎండుమిరపకాయలు  2  ,ఆయిల్  3 స్పూన్స్ తయారీ  విధానం  ముందుగా   తోటకూరను  శుభ్రంగా  కడిగి,  సన్నగా  తరుగుకోవాలి.  కందిపప్పును  శుభ్రం గా  కడుగుకోవాలి .  ఒక  బాణలి లో  కందిపప్పును  వేసి , తగినన్ని  నీళ్లు  పోసి,  ఉడికించుకోవాలి  .పప్పు  కొద్దిగా  ఉడికిన  తరువాత , తోటకూరను  కూడా   వేసి  ,బాగా  ఉడికిన తరువాత  , చిల్లులపళ్లెము లోవేసి  చల్లార్చుకోవాలి  . స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆ...