షోడశోపచారాలు
షోడశోపచారాలు మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం. అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు 1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం 1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము 2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి. 3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం. 4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. 5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అం...