మార్గశిర మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే
మార్గశిర మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికీ ప్రాశస్త్యం ఉంది. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. 1. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాస్నానము 2. తదియనాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం 3. చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు 4. పంచమినాడు నాగపంచమి వ్రతం 5. షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి 6. సప్తమి నాడు సూర్యారాధన సూర్యారాధన, నారాయణుడిని పూజిస్తారు 7. మార్గశిర శుద్ధ అష్టమిని ‘కాలభైవాష్టమి’ 8. నవమినాడు, త్రివిక్రమ, త్రిరాత్ర వ్రతం జరుపుతారు 9. దశమి రోజున పదార్థ వ్రతం, ధర్మవ్రతం 10. మార్గశిర శుద్ధ ఏకాదశి తిథినిమోక్షైకాదశి,సౌఖ్యదాఏకాదశిగా పిలుస్తార 11. ధనుర్మాసం కూడా వచ్చిఉంటేఅదేముక్కోటి(వైకుంఠ ఏకాదశి) అవుతుంది చంద్రమానాన్ని బట్టి ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుం...