కార్తీక మాసము " శ్రీ సత్యనారాయణ స్వామి " వ్రతము

కార్తీక మాసము " శ్రీ సత్యనారాయణ స్వామి " వ్రతము

" సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.
   లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః.  "

" హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప
   ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః."

పుణ్య ప్రదాయకమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వున్నాయి.
విశేషమైన ,విశిష్టమైన  ఈ వ్రతము ను గృహమునందు,  ఈ మాసంలోఆచరించిన
" సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును" .

దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "

" దేవాలయమున" , " నదీతీరమున " , " గోశాలలో" , " తులసీవనమున" ,
చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది.

శ్రీసత్యనారాయణస్వామి పూజ
సత్యనారాయణ వ్రతము, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.

వ్రత ప్రాశస్త్ర్యము 
కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.

" కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని,

కావున  " శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది , సంతానసౌభాగ్యాలు కలిగి ,
సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును" .

అంతట వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపెను.
శ్రీసత్యనారాయణస్వామి పూజ వ్రత కథ మొత్తము ఐదుభాగములుగా ఉండును.
ప్రతీ కథానంతమున నారికేళసమర్పణ ఆచారము.
శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,

ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను.
ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

సాష్టాంగ నమస్కారం

షోడశోపచారాలు