గాయత్రి మంత్రము


Gayatri Mantra in Telugu Meaning 

గాయత్రి మంత్రము


”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం 
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం     :     ప్రణవనాదం  
భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ 
భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ 
సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. 
తత్‌     :    ఆ 
సవితుర్‌     :    సమస్త జగత్తును 
వరేణ్యం     :    వరింపదగిన 
భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి 
దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను 
ధీమహి     :    ధ్యానించుచున్నాను 
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.  

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

సాష్టాంగ నమస్కారం

షోడశోపచారాలు