ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము) అశోక వనములో సీతను చూచిన హనుమంతుడుహనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విశ్వాసం. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు. " ధృత్యా సాగర లంఘనం హనుమతో, లంకామదోత్సారణం తత్రా శోకవనే చ మార్గణ, మథ శ్రీ జానకీ దర్శనమ్, రామక్షేమ నివేదనం, వనతరుం ప్రద్వంసనం, సంయుగే రక్ష స్సంహననం, పురీ ప్రదహనం, రామాయణే సుందరమ్. ఓం తత్సత్." భావము: ఆంజనేయుడు సముద్రము దాటుట, లంకానగర వీరుల గర్వమును అణచుట, అశోకవనములో సీతకై వెదకుట, జానకీదేవిని దర్శించి, శ్రీరాముని క్షేమమును ఆమెకు వినిపించుట, అశోకవనములోని వృక్షాలను పాడుచేయుట, రాక్షసులను చంపి లంకను తగులబెట్టి వచ్చుట, ఈ విషయములతో రామాయణములోని సుందరకాండ చాలా ప్రసిద్ధి చెందినది.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాతపరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించ...
Comments
Post a Comment