Posts

Showing posts from January, 2017

షోడశోపచారాలు

Image
షోడశోపచారాలు మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం. అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు 1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం 1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము 2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి. 3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం. 4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. 5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అం

కృష్ణాష్టకం

Image
కృష్ణాష్టకం శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః | గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౧ || యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్ స్థితౌ నిశ్శేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా | లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౨ || అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై- ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ | యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౩ || పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ | నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౪ || మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే | కవిత్వాదేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౫ || వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్ వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా | వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి

సంకష్టనాశన గణేశ స్తోత్రం

Image
సంకష్టనాశన గణేశ స్తోత్రం                                                          నారద ఉవాచ – 
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
 భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ || ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
 తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ || లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
 సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ || నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
 ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ || ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ || విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | 
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ || జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
 సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ || అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ||

ప్రాతః కాలమున కరదర్శనం

Image
ప్రాతః కాలమున కరదర్శనం కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మీ  కరమధ్యే సరస్వతి కరమూలేతు  గోవిందః ప్రభాతే కరదర్శనం // చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి,  చివరిభాగమున గోవిందుడు వున్నందున  ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. లేదా

మట్టెలు ఎందుకు ధరిస్తారు!

Image
హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వివాహం జరిగిన దగ్గర్నుంచి మంగళసూత్రంతో పాటుగా, కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి. ఇంతకీ కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు. వీటి వెనుక ఏవన్నా అంతరార్థాలు ఉన్నాయా అంటే కొన్ని కారణాలు కనిపించకపోవు... వెండితోనే ఎందుకు? బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము భాగం నుంచి కిందకి ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదన్నది ఒక నమ్మకం. ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్వుద్వాహకత చాలా ఎక్కువ. తద్వారా భూమికీ, శరీరానికీ మధ్య ఒక అనుసంధానంగా కాలిమట్టె పనిచేస్తుందనీ... ధరిత్రి మీద నుంచి వెలువడే శక్తి తరంగాలను శరీరానికి అందచేస్తుందని నమ్మకం. రెండో వేలికే ఎందుకు? మన శరీరంలోని నాడులన్నీ చేతులు, కాలి వేళ్లల్లో కేంద్రీకృతమయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. కాబట్టి మన చేతులు, కాళ్లలోని ఒకో ప్రాంతం మీదా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒకో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చునంటారు. అలా కాలికి ఉండే రెండో వేలి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. తద్వారా రుతుసంబంధమైన సమస్యలు, సంతానం కలగడంలో ఏర్

108 సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత

Image
108 సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సనాతనంగా ఉన్న విజ్ఞానాన్ని కొట్టిపారేస్తుంటాం. కానీ పాతబడినంత మాత్రాన సత్యం మాసిపోదన్న విషయాన్ని మర్చిపోతుంటాం. ఆందుకు గొప్ప ఉదాహరణే మన జీవితాలలో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత. ధార్మిక ప్రాధాన్యత గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరశతనామావళితో పూజిస్తాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగరమథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిచిన సాగరంలోంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో మంచీ, చెడు లక్షణాలు రెండూ ఉంటాయనీ... వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతామనీ ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావిచవచ్చునేమో! కేవలం క్షీరసాగరమథనమే కాదు- వైష్ణవ దివ్యదేశాలు, శ్రీ కృష్ణుని ముఖ్య గోపికలు... ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది. ప్రపంచం 108లో ఉందా? పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా, వందల ఏళ్ల క్రితమే మన ఖగోళశాస

గంగను భరించడంలో అంతరార్థం?

Image
గంగను భరించడంలో అంతరార్థం, చంద్రుని పొందడంలో అంతర్యం ? గంగను భరించడంలో అంతరార్థం? ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు. అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు. అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కార్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్రవహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకాలను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం. చంద్రుని పొందడంలో అంతర్యం? ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన క