Posts

Showing posts from 2016

బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్

Image
బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్ కావలిసిన  పదార్థాలు  1. బంగాళాదుంపలు  3  2. గ్రీన్ పీస్  అర కప్పు 3. బ్రెడ్ స్లైసెస్  8 4. గరం మసాలాపొడి  అర స్పూన్  5. అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్  6. జీడిపపప్పు  పొడి  1 స్పూన్  7. కారం  1 స్పూన్ 8. ఉప్పు  రుచికి  సరిపడా  9.  కొత్తిమీర  తురుము  1 స్పూన్  10. జీలకర్ర  పొడి  1 స్పూన్ 11.   ధనియాల  పొడి  1 స్పూన్  12.  ఆయిల్  4 స్పూన్స్ 13.   నెయ్యి తయారీ  విధానం ముందుగా  బంగాళదుంపలను , గ్రీన్ పీస్  ను  శుభ్రం  గా  కడిగి , కుక్కరులో  పెట్టి  ఉడికించుకోవాలి . చల్లారిన  బంగాళదుంపలను  , పైన  వున్న తొక్కను  తీసి ఒక పక్కన  పెట్టుకోవాలి . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి  , దోరగా  వేగాక , బంగాళదుంపలను  ,గ్రీన్...

సాష్టాంగ నమస్కారం

Image
సాష్టాంగ నమస్కారం స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి. " ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే " అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం - పాదములు, కరాభ్యాం - చేతులు, కర్నాభ్యాం - చెవులు. బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

Image
దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. 2. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. 3. బంగారం ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి. 4. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది 5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు. 7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు. 8. తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది. 9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది. 10. టెంకాయ  దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. 11. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది. 12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది ఈశ్వరలోక దర్శనం       కలుగుతుంది. 14. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది. 15. పండ్లను దానంచేస్తే బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

" దర్భ " యొక్క ప్రాముఖ్యం

Image
" దర్భ " యొక్క ప్రాముఖ్యం మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో 1. కుశ జాతి దర్భను శుకర్మలకు, 2. బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, 3. శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను     గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి,  భ...

లక్ష్మీ కటాక్షం లభించాలంటే

Image
లక్ష్మీ కటాక్షం లభించాలంటే 1. ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి. 2. సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. 3. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప     హారతులు   ఇవ్వాలి. 4. .ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి. 5. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు. 6. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయ అల్పాహారం తినకూడదు. 7. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. 8. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. 9. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి. 10. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. 11. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 12. ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేముందు లక్...

వంకాయ వేపుడు

Image
వంకాయ వేపుడు కావలిసిన  పదార్థాలు  1. వంకాయలు  పావుకేజీ 2.  పసుపు  కొద్దిగా  3. ఉప్పు  రుచికి  సరిపడా  4. కూర కారం  తగినంత  5. సెనగ పిండి  2 స్పూన్స్  6. ఆయిల్  6 స్పూన్స్ తయారీ  విధానం కూర కారానికి సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ , ఆవాలు అర  స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ , ధనియాలు 1 స్పూన్  ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి . వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి . వంకాయలను  శుభ్రం  గా  కడిగి ఒక మోస్తరు  ముక్కలు గా  తరుగుకోవాలి. స్టవ్  వెలిగించి.  వెడల్పయిన  బాణలి  పెట్టి  ఆయిల్  వేసి వంకాయ ముక్కలు  ,పసుపు   ,వేసి  బాగా  వేగనివ్వాలి  మధ్య  మధ్య లో   అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి . ఆయిల్  కూడా  వేస...

తోటకూర కందిపప్పు

Image
తోట కూర కందిపప్పు కావలిసిన  పదార్థాలు  1. తోటకూర  3 కట్టలు 2.  కంది పప్పు  1 కప్పు  3. పసుపు  కొద్దిగా  4. ఉప్పు రుచికి  సరిపడా  5. పచ్చిమిర్చి  2.  6. వెల్లుల్లి  రెబ్బలు  3  7. నీళ్లు  తగినన్ని పోపు దినుసులు  మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర  అర స్పూన్ , ఇంగువ  కొద్దిగా  , ఎండుమిరపకాయలు  2  ,ఆయిల్  3 స్పూన్స్ తయారీ  విధానం  ముందుగా   తోటకూరను  శుభ్రంగా  కడిగి,  సన్నగా  తరుగుకోవాలి.  కందిపప్పును  శుభ్రం గా  కడుగుకోవాలి .  ఒక  బాణలి లో  కందిపప్పును  వేసి , తగినన్ని  నీళ్లు  పోసి,  ఉడికించుకోవాలి  .పప్పు  కొద్దిగా  ఉడికిన  తరువాత , తోటకూరను  కూడా   వేసి  ,బాగా  ఉడికిన తరువాత  , చిల్లులపళ్లెము లోవేసి  చల్లార్చుకోవాలి  . స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆ...

బర్బాటీ బంగాళాదుంప కూర

Image
బర్బాటీ బంగాళాదుంప కూర కావలిసిన  పదార్థాలు  1. బర్బాటీలు  100. గ్రాములు  2. బంగాళాదుంపలు  4. 3. అల్లం  చిన్న ముక్క  4. పచ్చిమిర్చి  4. 5.  కరివేపాకు  కొద్దిగా  6. కొత్తిమీర 7.  పసుపు  కొద్దిగా  8. ఉప్పు  రుచికి  సరిపడా  9. నీళ్లు  తగినన్ని పోపు  దినుసులు  సెనగపప్పు  1 స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  , జీలకర్ర  అర  స్పూన్ , ఎండుమిరపకాయలు  2. ,ఆయిల్  3 స్పూన్స్. తయారీ విధానం  ముందుగా  బర్బాటీలు  ,బంగాళాదుంపలను  శుభ్రంగా  కడిగి ,  చిన్నముక్కలుగా  తరిగి ,తగినన్ని  నీళ్లు  పోసి  ,కుక్కరులోపెట్టి  ఉడికించుకుని,  చల్లార్చుకోవాలి . అల్లం  ,పచ్చిమిర్చిని  మెత్తని  పేస్ట్  లాగ  గ్రైండ్  చేసుకోవాలి  . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,వేడెక్కాక  ఆయిల్ వేసి,  పైన  చెప్పిన  పోపు ...

అమోఘం పుండరీకాక్షం

Image
అమోఘం పుండరీకాక్షం ఓం నమో నారాయణాయ " "అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషీకేశం జగన్నాధం వాగీసం వరదాయకమ్ " "శ్రీ సత్యనారాయణ స్వామియే నమః"

శ్రీరాముడు వంశ వృక్షo

Image
శ్రీరాముడు వంశ వృక్షo బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు. కాశ్యపుడు కొడుకు సూర్యుడు. సూర్యుడు కొడుకు మనువు. మనువు కొడుకు ఇక్ష్వాకువు. ఇక్ష్వాకువు కొడుకు కుక్షి. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షి కొడుకు బాణుడు. బాణుడు కొడుకు అనరణ్యుడు. అనరణ్యుడు కొడుకు పృధువు. పృధువు కొడుకు త్రిశంఖుడు. త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు) దుంధుమారుడు కొడుకు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధి కొడుకు ధృవసంధి. ధృవసంధి కొడుకు భరతుడు. భరతుడు కొడుకు అశితుడు. అశితుడు కొడుకు సగరుడు. సగరుడు కొడుకు అసమంజసుడు. అసమంజసుడు కొడుకు అంశుమంతుడు. అంశుమంతుడు కొడుకు దిలీపుడు. దిలీపుడు కొడుకు భగీరధుడు. భగీరధుడు కొడుకు కకుత్సుడు. కకుత్సుడు కొడుకు రఘువు. రఘువు కొడుకు ప్రవుర్ధుడు. ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు. శంఖనుడు కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు. శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు. మరువు కొడుకు ప్రశిష్యకుడు. ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు. అంబరీశుడు కొడుకు నహుషుడు. నహుషుడు కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుడు కొడు...

శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

Image
శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం ప్రధమం వేంకటేశ్వరం నామ ద్వితీయం సప్తగిరీశం తృతీయం పద్మావతీప్రియంచ చతుర్ధం ఆనందనిలయం పంచమం స్కందసన్నుతంచ షష్టం త్రయీవేదనుతం సప్తమం యశోదానందనంచ అష్టమం మౌక్తికమండపస్థితం నవమం సాలగ్రామధరంచ దశమం శేషశాయినం ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ ద్వాదశం వకుళాత్మజం.

సింధూర ధారణ

Image
సింధూర ధారణ సింధూర ధారణ 1. సింధూరాన్ని హనుమంతునికి పూస్తారు. 2. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ నుదుటన ధరించే వారికి అన్ని రకాల  సమస్యలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. 3. ఎవరింట్లో నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు      రోజూ సింధూర ధారణ చేయాలి. 4. అలాగే ప్రతి విషయానికి భయంతో వణికిపోతుండే వారికి సింధూరం పెడితే భయం తొలగిపోతుంది. 5. భార్య భర్తలు, పిల్లల మధ్య సఖ్యత లేని వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. 6. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగ బాధలు దరిచేరవు. ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు. 7. విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. 8. లో బీపీ, రక్త హీనతతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. 9. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజూ సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది. 10. ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్ర...

స్కందోత్పత్తి

Image
స్కందోత్పత్తి స్కందోత్పత్తి 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! 8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! 9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన! ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్! అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన! శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! 12. దేవతానా...

గోవిందాయనమః

Image
గోవిందాయనమః ఓం గోవిందాయనమః
    ఓం విష్ణవేనమః
    ఓంమధుసూదనాయనమః
    ఓం త్రివిక్రమాయనమః
    ఓం శ్రీధరాయనమః
  ఓం హృషీకేశాయనమః
  ఓంపద్మనాభాయనమః
  ఓం దామోదరాయనమః
  ఓం సంకర్షణాయనమః
    ఓం వాసుదేవాయనమః
    ఓం ప్రద్యుమ్నాయనమః
    ఓం అనిరుద్దాయనమః
    ఓం పురుషోత్తమాయనమః
    ఓం అధోక్షజాయనమః
    ఓం నారసింహాయనమః
    ఓం అచ్యుతాయనమః
  ఓం జనార్ధనాయనమః
    ఓంఉపేంద్రాయనమః    
    ఓంహరయేశ్రీకృష్ణాయనమః

శ్రీజ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్

Image
శ్రీజ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్ 1:విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్ పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ 2:పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్ నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్ నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ 3:తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్ తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్ తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ 4:నమోస్కు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై 5:నమోస్తు గోదావరీ తట నివాసిన్యై నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై 6:నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై 7:నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై నమోస్తు సహస్రార చక్ర నిలయాయై...

శ్రీదుర్గాష్టోత్తర శనామ స్తోత్రము

Image
శ్రీదుర్గాష్టోత్తర శనామ స్తోత్రము ఓం దుర్గా శివా మహాలక్ష్మీర్మహౌగౌరీచ చండి కా సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా||    1 సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా భూమిజా నిర్గుణాధార శక్తి శ్చానీశ్వరీతథా||     2 నిర్గుణా నిరహంకారా సర్వగర్వ విమర్దినీ సర్వ్వలోక ప్రియా వాణీ సర్వ విద్యాధిదేవతా||    3 పార్వతీ దేవమాతా చ వనేఎశా విధ్యవాసినీ తేజోవతీ మహామాతా కోటిసూర్య సమప్రభా||    4 దేవతా వహ్నిరూపా చ సతోజా వర్ణరూపిణీ గుణాశ్రయా గుణామధ్యా గుణత్రయ వివర్జితా||    5 కర్మజ్ఞాన ప్రదా కాంతా సర్వసమ్హార కారిణీ ధర్మజ్ఞానా ద్థర్మనిష్టా సర్వకర్మ వివర్జితా||    6 కామాక్షీ కామసంహంత్రీ కామక్రోధ వివర్జితా శాంకరీ శాంభవీ శాంతా చంద్ర సూర్యాగ్ని లోచనా||    7 సుజయా జయభూమిష్టా జాహ్నవీ జనపూజితా శాస్త్రా శాస్త్రమయా నిత్యశుభా చంద్రార్ధమ స్తకా||    8 భారతీ బ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా బ్రాహ్మీనారయాణీ రౌద్రీ చంద్రామృత పరిశృతా||    9 జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికాణీ బ్రహ్మాండకోటి సంస్థానా కామినీ కమల...

శ్రీలక్ష్మీ ప్రార్థన

Image
శ్రీలక్ష్మీ ప్రార్థన లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ బ్రహ్మేన్ద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుమ్బినీం సరసిజాం వన్దేముకుందప్రియాం.

సకల కార్యసిద్దికి దుర్గా సప్తశ్లోకి

Image
సకల కార్యసిద్దికి దుర్గా సప్తశ్లోకి జ్ఞనినామపి చేతాంసి దేవీ భగవతిఉహిసా ! బలదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గేస్మృతా హరసి భీతి సుశేషజంతొః ! స్వస్థేః స్మృతా మతిమతీన శుభాందవాసి !! దారిద్ర్యదుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ర్థ చిత్తా !! సర్వమంగళ మాంగళ్యే శువేసర్వార్థసాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమస్తుతే !! శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరేదేవి నారాయణినీమోస్తుతే !! సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యఃస్త్రాహినోదేవి దుర్గేదేవి నమస్తుతే !! రోగానశేషానపహసింతుష్టా రుష్టాతుకామాన్ సకలాసభీష్టాన్ ! త్వామాశ్రితానాంసవిపన్న రాణాం త్వామాశ్రితాహ్యాశయతాం ప్రయాంతి !! సర్వాభాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యమస్మద్వైరివినాశనం !! శ్రీ మహాకాళి , మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ జగదంబా శ్రీ భద్ర కాళీ పరాంబాయై నమః

శ్రీసూర్యస్తోత్రం

Image
శ్రీసూర్యస్తోత్రం ధ్యానం | 
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం |
 భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ || 
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |
 భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః | 
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ || బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
 అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ || ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
 సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ || పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః || ౫ || కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
 ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః || ౬ || సకలేశాయ సూర్యాయ ఛయేశాయ నమో నమః |
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం || ౭ || సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |
 ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ || ౮ || సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౯ ||

సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు.

Image
సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రమణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యముంది. తండ్రికే జ్ఞానభోద చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే ఆలయాలు అధికంగా ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖ స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది. తిరుచందూర్ సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్‌లో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్‌లో కొలువై నిలిచారట. తిరుచందూర్‌లోని సుబ్రమణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. కుంభకోణం స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్...

దీర్ఘాయువు

Image
దీర్ఘాయువు దీర్ఘాయువు ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామ్రుతాత్ ఇది మహా మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం అపమృత్యువును తొలగించడమే కాక దీర్ఘాయువు , శాంతి, సౌఖ్యం, ధనధాన్యాలు, సంపద, సంతోషం ప్రసాదించే పవిత్రమైన మంత్రం. పాముకాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు, వంటి అనుకోని దుర్ఘటనల నుంచి కాపాడే కవచం. భక్తీ విశ్వాసాలతో ప్రతి నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే మొండి రోగాలు సైతం నయమవుతాయి అని ఋషుల ఉవాచ. 1. స్నానం చేస్తూ ఈ మంత్రం జపిస్తే రోగ విముక్తులవుతారు. 2. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. 3. పాలు తాగేటప్పుడు జపిస్తే యవ్వనం చేకూరుతుంది. 4. రోగుల చెవిలో ఈ మంత్రాన్ని క్రమసంఖ్య లో జపిస్తూ ఉంటె వ్యాధి నుంచి విముక్తి కలిగి ఆయుర్దాయం పెరుగుతుంది. 5. గృహం లో చిక్కు సమస్యలు, చికాకులు ఉంటె పండితులచే ఇంటిలో మృత్యుంజయ హోమం చేయిస్తే చికాకులు తొలగి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రం, చంద్ర శేఖర అష్టకం, విశ్వనాధాష్టకం, సౌందర్యలహరి చదవడం వలన కూడా మృత్యువును అడ్డుకోవచ్చు. 1. ఆహార అలవాట్లు కూడా ఆయుర్దాయం పెంచడంలో ఎంతో దోహదం చేస్తాయి అని ప...

శారద నీరదేందు

Image
శారద నీరదేందు " శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా  హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం -  దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా -  కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ "  అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.

అమ్మల గన్న యమ్మ

Image
అమ్మల గన్న యమ్మ " అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె  ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో  నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా  యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"  అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.

మార్గశిర లక్ష్మీవార వ్రతం’.

Image
మార్గశిర లక్ష్మీవార వ్రతం’. మార్గశిర లక్ష్మీవార వ్రతం’. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4వర్ణాల వారూ ఇళ్ళను గోమయం(ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"మహనీయ, ఈ పూజను ఇంతక ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి "అనగా, పరాశరుడు కధ చెప్పడం మొదలుపెట్టాడు.  ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్...

మణిద్వీప వర్ణన

Image
" మణిద్వీప వర్ణన " పారాయణంతో సకల శుభాలు కలుగుతాయి మణిద్వీప వర్ణన మణిద్వీప వర్ణన పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి. శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే  " మణి ద్వీపం." 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉంటుంది. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై ఉంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కం...