బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్
బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్ కావలిసిన పదార్థాలు 1. బంగాళాదుంపలు 3 2. గ్రీన్ పీస్ అర కప్పు 3. బ్రెడ్ స్లైసెస్ 8 4. గరం మసాలాపొడి అర స్పూన్ 5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ 6. జీడిపపప్పు పొడి 1 స్పూన్ 7. కారం 1 స్పూన్ 8. ఉప్పు రుచికి సరిపడా 9. కొత్తిమీర తురుము 1 స్పూన్ 10. జీలకర్ర పొడి 1 స్పూన్ 11. ధనియాల పొడి 1 స్పూన్ 12. ఆయిల్ 4 స్పూన్స్ 13. నెయ్యి తయారీ విధానం ముందుగా బంగాళదుంపలను , గ్రీన్ పీస్ ను శుభ్రం గా కడిగి , కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి . చల్లారిన బంగాళదుంపలను , పైన వున్న తొక్కను తీసి ఒక పక్కన పెట్టుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి , దోరగా వేగాక , బంగాళదుంపలను ,గ్రీన్...