బర్బాటీ బంగాళాదుంప కూర

బర్బాటీ బంగాళాదుంప కూర

కావలిసిన  పదార్థాలు 
1. బర్బాటీలు  100. గ్రాములు 
2. బంగాళాదుంపలు  4.
3. అల్లం  చిన్న ముక్క 
4. పచ్చిమిర్చి  4.
5.  కరివేపాకు  కొద్దిగా 
6. కొత్తిమీర
7.  పసుపు  కొద్దిగా 
8. ఉప్పు  రుచికి  సరిపడా 
9. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
 సెనగపప్పు  1 స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్ , ఎండుమిరపకాయలు  2. ,ఆయిల్  3 స్పూన్స్.

తయారీ విధానం
 ముందుగా  బర్బాటీలు  ,బంగాళాదుంపలను  శుభ్రంగా  కడిగి ,
 చిన్నముక్కలుగా  తరిగి ,తగినన్ని  నీళ్లు  పోసి  ,కుక్కరులోపెట్టి  ఉడికించుకుని,
 చల్లార్చుకోవాలి . అల్లం  ,పచ్చిమిర్చిని  మెత్తని  పేస్ట్  లాగ  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,వేడెక్కాక  ఆయిల్ వేసి,
 పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి,  దోరగా  వేగాక  ,
కరివేపాకు  ,అల్లం ,పచ్చిమిర్చి  పేస్టను  వేసి   ,
దోరగా  వేగాక  ,ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న 
బర్బాటీ  ,బంగాళాదుంప  ముక్కలు , పసుపు  ,తగినంత  ఉప్పు  వేసి  ,
బాగా కలిపి  కొద్దిసేపు  మగ్గనిచ్చి  ,స్టవ్  ఆఫ్  చేసుకుని 
ఒక  బౌల్ లోకి  కూరను  తీసుకుని 
పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే,
 బర్బాటీ  బంగాళా దుంప  కూర  రెడీ అవుతుంది.
ఈ కూర  అన్నం లోను  చపాతీలలోను బాగుంటుంది.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

శారద నీరదేందు

షోడశోపచారాలు