వంకాయ వేపుడు

వంకాయ వేపుడు

కావలిసిన  పదార్థాలు 
1. వంకాయలు  పావుకేజీ
2.  పసుపు  కొద్దిగా 
3. ఉప్పు  రుచికి  సరిపడా 
4. కూర కారం  తగినంత 
5. సెనగ పిండి  2 స్పూన్స్ 
6. ఆయిల్  6 స్పూన్స్

తయారీ  విధానం
కూర కారానికి
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర  స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ , ధనియాలు 1 స్పూన్
 ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా
విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి .
వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ
గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి .

వంకాయలను  శుభ్రం  గా  కడిగి
ఒక మోస్తరు  ముక్కలు గా  తరుగుకోవాలి.
స్టవ్  వెలిగించి.  వెడల్పయిన  బాణలి  పెట్టి  ఆయిల్  వేసి
వంకాయ ముక్కలు  ,పసుపు   ,వేసి  బాగా  వేగనివ్వాలి 
మధ్య  మధ్య లో   అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి .
ఆయిల్  కూడా  వేస్తూ  ఉండాలి .
బాగా  వేగిన  తరువాత  సెనగ  పిండిని   వేసి  బాగా  కలిపి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి  , తగినంత  ఉప్పు  , కూర కారం  వేసి ,
 బాగా  కలిపి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 వంకాయ  వేపుడు  రెడీ  అవుతుంది
ఈ  వేపుడు  వేడి  అన్నంలోను  బాగుంటుంది

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

శారద నీరదేందు

షోడశోపచారాలు